రంజీ ట్రోఫీలో ఛత్తీస్‌గఢ్‌పై హైదరాబాద్ ఒక వికెట్ తేడాతో గెలిచింది. 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 9 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అభిరాథ్ 68, వరుణ్ 55 పరుగులు చేయగా, అనికేత్ 39, రక్షణ్ 15 పరుగులతో అజేయంగా నిలిచి ఆఖరి వికెట్‌కు 39 రన్స్ జోడించి గెలిపించారు.