కరీంనగర్‌లోని అలుగునూర్‌లో నవంబర్ 29న బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో దీక్షాదివస్ సభ నిర్వహించనున్నారు. సభా ప్రాంగణాన్ని, వాహనాల పార్కింగ్ స్థలాలను మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని గంగుల కమలాకర్ వెల్లడించారు.