హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ స్కూళ్లు లక్షల్లో ఫీజులు వసూలు చేయడమే కాకుండా, చిల్డ్రన్స్ డే వంటి కార్యక్రమాలకు కూడా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఓ ప్రముఖ స్కూల్ తెలంగాణ స్పోర్ట్స్ లీగ్ పేరుతో నవంబర్ 14న చిల్డ్రన్స్ డే నిర్వహించేందుకు 4 నుండి 9వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు సర్క్యులర్ జారీ చేసింది.