రాష్ట్రంలో 7,767 ఎంపీటీసీ, 582 జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల ఫలితాలు ఈరోజు వెల్లడికానున్నాయి. ఇందుకోసం ఎస్ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే నామినేషన్ల ఘట్టంలో దౌర్జన్యాలు, రిగ్గింగ్ ఆరోపణల వల్ల ఈ ఫలితాలపై ప్రజల్లో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదని చర్చ జరుగుతోంది.