ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 365 కేంద్రాల్లో ఈ లెక్కింపు జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన 21,012 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ ఫలితాలతో తేలనుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత సాధారణ బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తున్నారు.