న్యూయార్క్ సిటీ మారథాన్‌లో పెన్సిల్వేనియాకు చెందిన రాచెల్ అపా (24) సెంట్రల్ పార్క్ వద్ద కుప్పకూలింది. 26.2 మైళ్ల పరుగులో 24వ మైలు వద్ద ఆరోగ్యం క్షీణించి ఆమె ప్రాణాలు కోల్పోయింది. 18వ మైలు దాటాక 'ఔచ్' అని తండ్రికి మెసేజ్ పంపినట్లు తెలిసింది.