అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లోని ఓవల్‌ ఆఫీస్‌లో శుక్రవారం దీపం వెలిగించి దీపావళి జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాష్‌ పటేల్‌, జై భట్టాచార్య, అరవింద్‌ కృష్ణ, మార్కో రుబియో పాల్గొన్నారు. విశాల్‌ గోండల్‌ ఆయనకు హనుమాన్‌ చాలీసా బహూకరించారు. ఈ సంప్రదాయాన్ని 2003లో జార్జి బుష్‌ ప్రారంభించారు.