విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కోడలు బొత్స పూజిత విజయం సాధించారు. గరివిడి జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కిమిడి సంధ్యపై ఆమె 1,599 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మొత్తం 27 జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ ఒక చోట గెలిచి, మూడింటిలో ఆధిక్యం చూపించింది.