సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ నటించిన 'భోగి' సినిమా నవంబర్ 12న విడుదల కానుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటించారు. ప్రమోషన్లలో భాగంగా ఎల్లుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశంగా మారింది.

