తమిళనాడు సీఎం విజయ్ మళ్లీ కెమెరా ముందుకు రానున్నట్లు సమాచారం. అయితే ఇది సినిమా కోసం కాదు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందే భారీ బడ్జెట్ ప్రభుత్వ వాణిజ్య ప్రకటనలో ఆయన కనిపించనున్నారు. ఈ యాడ్ షూటింగ్ కోసం విజయ్ రెండు రోజుల సమయం కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి.
