రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో రూ.50 లక్షల ఇంకుడు గుంతల నిర్మాణ టెండర్ విషయంలో ఇద్దరు కాంట్రాక్టర్ల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు పరస్పరం తీవ్రంగా దూషించుకున్నారు. ఆన్‌లైన్ టెండర్ వేయవద్దంటూ బెదిరించడంతో ఆఫీస్ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.