సూర్యాపేటలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఫొటో లేకపోవడంతో ఆయన వర్గీయులు నిరసన తెలిపారు. దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత పార్టీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రాంగణంలో గందరగోళం నెలకొంది.