ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం ఎంపీటీసీ స్థానానికి జనసేన తరఫున పోటీ చేసిన గార్లపాటి దివ్య హఠాన్మరణం చెందారు. శనివారం ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. దివ్య మృతి పట్ల జనసేన పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది.
రిజల్ట్స్‌కు ముందే జనసేన ఎంపీటీసీ అభ్యర్థి దివ్య కన్నుమూత
చిత్రణ