ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం వర్తమన్నూర్‌కు చెందిన రైతు పరచ భీంరావు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. 3 ఎకరాల 6 గుంటల్లో పత్తి, సోయా సాగుకు రూ.3.50 లక్షల అప్పు చేశారు. వర్షాల్లేక పంట నష్టపోవడంతో ఈ నెల 1న పురుగులమందు తాగగా, రిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు.