పరిషత్ ఎన్నికల్లో విశాఖలో 82 శాతం, ఇతర జిల్లాల్లోనూ భారీగా పోలింగ్ నమోదైంది. విశాఖ, అనకాపల్లి జెడ్పీలను తామే గెలుస్తామని కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. కూటమిలో విభేదాల వల్ల శ్రీకాకుళంపై వైసీపీ ఆశలు పెట్టుకోగా, బొత్స సొంత జిల్లా విజయనగరం జెడ్పీ ఫలితంపై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది.
