తాడేపల్లి ప్రెస్ మీట్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఎదురైన ఎన్నికల పరాజయాలపై పెద్దగా మాట్లాడలేదు. మున్సిపల్ ఫలితాల కారణాలను సమీక్షించకుండా, మొత్తం ఎన్నికల ప్రక్రియనే ఆయన తప్పుపట్టారు. ప్రస్తుత ఎన్నికలను సెలక్షన్లుగా జగన్ అభివర్ణించారు. కూటమిపై ఆరోపణలు గుప్పించారు.