నిజామాబాద్ జిల్లా మాణిక్ బండార్‌లో రూ.10 వేల అప్పు విషయమై శంకర్, వినయ్ మధ్య ఘర్షణ జరిగింది. ఇంటి వద్ద కర్రతో దాడి జరగగా, పిఎస్ వద్ద వినయ్‌పై శంకర్ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వినయ్‌ను ఆసుపత్రికి తరలించి, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు.