భారత యువ షట్లర్ తన్వి పట్రి యూత్ ఒలింపిక్స్‌లో రజతం సాధించి చరిత్ర సృష్టించింది. సెనెగల్‌లోని డాకర్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనాకు చెందిన జాంగ్ యి జిన్‌తో 82 నిమిషాల పాటు పోరాడి ఓటమి పాలైంది. ఈ విభాగంలో రజతం గెలిచిన తొలి భారత షట్లర్‌గా 15 ఏళ్ల తన్వి నిలిచింది.