టీమిండియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ నుంచి న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా వైదొలిగాడు. ప్రాక్టీస్‌లో మాట్ హెన్రీతో ఢీకొని తలకు గాయం కావడంతో అతడు కన్‌కషన్‌కు గురయ్యాడు. కాన్వే స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ నిక్ కెల్లీని ఎంపిక చేసినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
భారత్‌తో వన్డే సిరీస్ నుంచి కివీస్ ఓపెనర్ కాన్వే ఔట్




