టీమిండియా బ్యాటర్ రోహిత్ శర్మ వన్డేల్లో ఘనమైన రికార్డులు సాధించినా కొందరు బౌలర్లు అతడిని పదేపదే ఔట్ చేశారు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో కైల్ జేమీసన్ బౌలింగ్‌లోనే రోహిత్ (28) ఔటయ్యాడు. వన్డేల్లో రోహిత్‌ను నాలుగుసార్లు ఔట్ చేసిన బౌలర్ల జాబితాలో జేమీసన్ నిలిచాడు.