దేశంలో వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటికి సాధారణ రైళ్లలా ప్రత్యేక ఇంజిన్లు ఉండవు, కేవలం లోకో పైలట్ క్యాబిన్లు మాత్రమే ఉంటాయి. ప్రతీ రెండో కోచ్ కింద అమర్చే మోటార్ల శక్తితో ఇవి నడుస్తాయి. లగ్జరీ సదుపాయాలున్న ఈ రైళ్లను దశలవారీగా విస్తరించనున్నారు.