పాఠశాల విద్యార్థుల ఏఐ వినియోగంపై గూగుల్ కీలక మార్పులు తెచ్చింది. కే-12 విద్యార్థులు జెమిని, గూగుల్ సెర్చ్ వాడాలంటే పాఠశాలల అనుమతి తప్పనిసరి. ఏఐ సేవలపై పాఠశాలలే నిర్ణయం తీసుకోవచ్చని సంస్థ ప్రతినిధి క్రిస్ ఫిలిప్స్ తెలిపారు. రాబోయే నెలల్లో దీనిపై మరిన్ని వివరాలు అందిస్తామని గూగుల్ స్పష్టం చేసింది.