భారతి ఎయిర్‌టెల్ రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్‌ను పాత ధరలోనే మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అలాగే 12 నెలల ఉచిత అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా అందుతుందని సమాచారం.