దేశవ్యాప్తంగా ధన్‌తేరస్ సందర్భంగా భారతీయులు సుమారు రూ.60,000 కోట్ల విలువైన బంగారాన్ని కొనుగోలు చేశారు. గతేడాదితో పోలిస్తే ఇది 15-20 శాతం పెరిగింది. బంగారం, వెండి అమ్మకాలు రూ.66,000 కోట్లు దాటగా, ఒక్క ఢిల్లీలోనే రూ.10,000 కోట్ల పైగా టర్నోవర్ నమోదైందని ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్స్ ఫెడరేషన్ తెలిపింది.