నల్లగొండ జిల్లా కనగల్ మండలానికి చెందిన శ్రీజ రెడ్డి కోయ అమెరికాలోని బోస్టన్‌లో అదృశ్యమయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌లో చదువుతున్న ఆమె నవంబర్ 2న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. స్నేహితుల ఫిర్యాదుతో బోస్టన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి కార్సన్ బీచ్ ప్రాంతంలో గాలిస్తున్నారు.