డాక్టర్స్ ఇండియన్ పికిల్ బాల్ లీగ్ (డీఐపీఎల్) రెండో సీజన్ హైదరాబాద్‌లోని గండిపేట క్రాస్ కోర్ట్స్ కాంప్లెక్స్‌లో శనివారం ప్రారంభమైంది. ఇందులో 11 జట్లు పాల్గొంటున్నాయి. డిసెంబర్ 19న ఫైనల్స్ జరగనున్నాయి. వైద్యుల్లో పని ఒత్తిడి తగ్గించి, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఈ లీగ్ దోహదపడుతుందని ఫౌండర్ డాక్టర్ రవి ఆండ్రూస్ తెలిపారు.