అమెరికా శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్‌లో దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీపం వెలిగించి దీపావళి వేడుకలను ప్రారంభించారు. ఇండో-అమెరికన్ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త విశాల్ గోండల్, ట్రంప్‌కు హనుమాన్ చాలీసాను బహుమతిగా ఇచ్చారు. సంజయ్ మెహ్రోత్రా, వికాశ్ ఖన్నా, అరవింద్ కృష్ణ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా బహుమతి




