స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సాధించిన విజయాలు ఏపీ ప్రజలకు దీపావళి పండుగను ముందుగానే తీసుకువచ్చాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఎక్స్ వేదికగా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పట్టణ ప్రాంతాల్లో కూటమికి ఓటర్ల మద్దతు లభించిందని ఆయన అన్నారు.