ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి విజయంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ ఫలితాలు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన ఆయన, గెలిచిన అభ్యర్థులు అహంకారం వీడి పనిచేయాలని సూచించారు.