సెనెగల్‌లోని డకార్‌లో జరుగుతున్న యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో భారత స్విమ్మర్ ధినిధి దేశింగు సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ పోటీని 2 నిమిషాల 02.28 సెకండ్లలో ముగించి కాంస్యం నెగ్గింది. ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచింది.