సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవునిగుట్ట తండాలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. మూసీ సుందరీకరణకు నిధులు ఉన్నాయని, రైతులకు ఇవ్వడానికి లేవా అని ప్రశ్నించారు. దేవాదుల మోటార్ల నడిపింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.