విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వాములయ్యారు.