ఇంటి నిర్మాణం, పునరుద్ధరణలో ఫ్లోరింగ్ ఎంపిక బడ్జెట్, నిర్వహణపై ప్రభావం చూపుతుంది. టైల్స్ చదరపు అడుగుకి నాన్-బ్రాండెడ్ రూ.50-రూ.55, బ్రాండెడ్ రూ.80-రూ.95 ధరకు లభిస్తాయి. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకుని, సులభంగా శుభ్రం చేయడానికి అనువుగా ఉంటాయి. అయితే బరువైన వస్తువులు పడితే ఇవి పగిలిపోతాయి.