విద్యుత్ సంస్ధలు కరెంట్ బిల్లును టెలిస్కోపిక్ స్లాబ్ విధానంలో లెక్కిస్తాయి. మీటర్లు విద్యుత్ వాడకాన్ని కిలోవాట్ అవర్‌లో లెక్కిస్తాయి. ఒక కిలోవాట్ అవర్‌ను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. ఉదాహరణకు 1000 వాట్ల గీజర్‌ను గంటపాటు వాడితే ఒక యూనిట్ విద్యుత్ ఖర్చువుతుంది.