ప్రముఖ గ్రాఫిక్ డిజైన్ ప్లాట్‌ఫామ్ కాన్వా రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా 1,271 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. బాధిత సిబ్బందికి 6 నెలల జీతం, ఏడాది హెల్త్ కవరేజ్, ఉచిత లింక్డ్‌ఇన్ సబ్‌స్క్రిప్షన్, ల్యాప్‌టాప్ ఉంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. వ్యాపారం ప్రారంభించే వారికి ₹8.8 లక్షల సాయం అందించనున్నట్లు సీఈఓ మెలానీ పెర్కిన్స్ తెలిపారు.