తెలుగు చిత్రసీమలో సీక్వెల్స్ సంస్కృతి బాగా పెరిగింది. అనేక సినిమాలు ముగింపులో క్లిఫ్‌హ్యాంగర్లు మరియు తదుపరి భాగాలపై హింట్లు ఇస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ దేవర 2, పవన్ కళ్యాణ్ ఓజీ 2 వంటి భారీ చిత్రాల సీక్వెల్స్ పట్టాలెక్కడంపై స్పష్టత లేకపోవడంతో ప్రేక్షకులు ఎదురుచూడక తప్పడం లేదు.