టాలీవుడ్ ప్రముఖులు వరుసగా పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. సాయిదుర్గ తేజ్ స్నేహితురాలు కిరణ్మయితో ఎంగేజ్‌మెంట్ చేసుకోగా, వచ్చే నెలలో హైదరాబాద్‌లోనే వివాహం జరగనుంది. సంగీత దర్శకుడు కాలభైరవ నటి కావ్య కల్యాణ్ రామ్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. హీరో తేజ సజ్జా ఈ నెలలోనే నిశ్చితార్థం చేసుకుని, వచ్చే నెలలో ఉదయ్‌పూర్‌లో వివాహం ఆడనున్నారు.