చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు జెడ్పీటీసీ స్థానాల్లో మూడింటిని వైకాపా గెలుచుకుంది. వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన చిన్న కుమారుడు హర్షిత్ రెడ్డిని తిరుపతి రూరల్ జెడ్పీటీసీ స్థానం నుంచి గెలిపించారు. దాదాపు 1,52,000 మంది ఓటర్లు ఉన్న ఈ స్థానంలో ఈ నెల 5న 85,335 ఓట్లు పోలయ్యాయి.