పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం చేయాలని సీఈవో సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సూర్యాపేటలలో గతంతో పోలిస్తే తక్కువ నమోదుపై ఆందోళన వ్యక్తం చేశారు. 21 జిల్లాల్లో పెండింగ్ దరఖాస్తులను నవంబర్ 20లోగా పరిష్కరించాలని, తిరస్కరించే దరఖాస్తులకు స్పష్టమైన కారణాలు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు.