హైదరాబాద్‌ నాంపల్లిలోని రజాక్‌ మంజిల్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు గేటుకు తాళం వేసి ఆంక్షలు విధించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ప్రజలు, మసీదుకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. వక్ఫ్‌, ఉర్దూ అకాడమీ భూముల వ్యవహారాలు బయటపడకుండానే అధికారులు ఇలా చేస్తున్నారని మైనారిటీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.