ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కాంగ్రెసే ప్రత్యామ్నాయమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. చీరాల మునిసిపాలిటీలో కాంగ్రెస్ పది వార్డులు గెలవడమే దీనికి సంకేతమని ఆమె చెప్పారు. ఈ విజయంపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను ఆమె అభినందించగా, మిగతా చోట్ల ఖాతా తెరవలేదని విమర్శలు వస్తున్నాయి.