తెలంగాణలో ఈనెల 19న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సిద్ధిపేట సభలో ఈ పథకంతో పాటు ఇందిరమ్మ చీరల రెండో విడత పంపిణీ మొదలవుతుంది. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందుతుందని, ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులు సేకరిస్తాయని చెప్పారు.