తెలంగాణలో గృహప్రవేశాలు పూర్తిచేసుకున్న ఇందిరమ్మ ఇళ్లలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు జరపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్-మల్కాజిగిరిలో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన పోస్టర్ ఆవిష్కరించారు. తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లకు గాను 2.21 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, ప్రతీ సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లోకే నిధులు జమచేస్తామని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలకు ప్రభుత్వం పిలుపు

Source: 10TV — Telangana


