వెస్టిండీస్‌తో సిల్హెట్లో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఓపెనర్ షాద్మాన్ ఇస్లాం తీవ్రంగా గాయపడ్డాడు. 78వ ఓవర్లో బంతిని ఆపే క్రమంలో మంచు వల్ల జారిపడటంతో అతని ఎడమ చీలమండ దెబ్బతింది. నడవలేకపోయిన అతడిని స్ట్రెచర్‌పై మైదానం వెలుపలికి తెచ్చి స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు.
క్రికెట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ షాద్మాన్ ఇస్లాంకు తీవ్ర గాయం




