భారత్‌తో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ ప్లేయర్ మ్యాట్ ఫిషర్ ప్లేయింగ్ 11లో లేకపోయినా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్ సమయంలో బ్లెయిర్ టిక్నర్ హెల్మెట్‌కు బంతి తగలడంతో, అతడి స్థానంలో ఫిషర్‌ను కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి దించారు. ఫిషర్ తొలి బంతికే అక్షర్ పటేల్ వికెట్ తీశాడు.