అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్డాస్ జానయ్యపై మహిళా ప్రొఫెసర్ వేధింపుల ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని సిబ్బంది, విద్యార్థులు నిరసన ర్యాలీ చేశారు. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించిన తోటి ప్రొఫెసర్, వీసీ వేధింపులకు సహకరిస్తున్న వారి పేర్లు బయటపెడతామని హెచ్చరించారు.