న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. నవంబర్ 4న జరిగిన తొలి వన్డేలో కివీస్ 185 పరుగులకే ఆలౌట్ కాగా, నవంబర్ 7న వెల్లింగ్టన్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో 134 పరుగులకే కుప్పకూలింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 200 లోపే ఆలౌటై కివీస్ 25 ఏళ్ల నాటి చెత్త రికార్డును సమం చేసింది.