న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ 23 పరుగులు చేసి రెండు రికార్డులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదడంతో కివీస్‌పై వన్డేల్లో అతడి సిక్సర్ల సంఖ్య 51కి చేరింది. దీంతో 50 సిక్సర్లు కొట్టిన షాహిద్ అఫ్రిది రికార్డును దాటి రోహిత్ అగ్రస్థానానికి చేరుకున్నాడు.
రోహిత్ శర్మ రికార్డు: న్యూజిలాండ్‌పై అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా ఘనత




