మలయాళ నటి అనస్వర రాజన్ తెలుగులో వరుస చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. గతంలో ‘ఛాంపియన్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె, త్వరలో అనీష్ హీరోగా వెంకీ కుడుముల నిర్మించిన ‘ఇట్లు అర్జున’లో నటించింది. ఆ తర్వాత సంక్రాంతికి విడుదల కానున్న ‘కాకా’ సినిమాలో చిరంజీవి కూతురిగా కనిపించనుంది.