వైసీపీ నుంచి గెంటేయడం వల్లే తాను బయటకు వచ్చినట్లు ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. ఆ పార్టీలో తనకు 70కి పైగా అవమానాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం జగన్ పాలనలోనే తనకు అవమానాలు ఎదురయ్యాయని, జగన్ చెప్పుడు మాటలు విని అవమానించారని పేర్కొన్నారు.